యుద్ధం బీఆర్ఎస్‌తో కాదు.. కౌశిక్‌రెడ్డితోనే: గాంధీ

58చూసినవారు
యుద్ధం బీఆర్ఎస్‌తో కాదు.. కౌశిక్‌రెడ్డితోనే: గాంధీ
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘గురువారం ఉదయం 11 గంటలకు నా ఇంటికి వస్తానని కౌశిక్‌రెడ్డి అన్నారు.. రానందున వాళ్ల ఇంటికి నేనే వెళ్లా. ఇది బీఆర్ఎస్, గాంధీకి యుద్ధం కాదు. కౌశిక్‌రెడ్డితో యుద్ధం అనుకుని వెళ్లాను. ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తించాలి. ఇలాంటి వాళ్లు బిఆర్ఎస్‌లో ఉంటే మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయే ప్రమాదముంది’’ అని గాంధీ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్