రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదు: మంత్రి అచ్చెన్న

77చూసినవారు
రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదు: మంత్రి అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ అధినేత జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతంలో వరదలు వస్తే వైసీపీ పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్