AP: రాష్ట్రంలోని 214 మార్కెట్ కమిటీలు, 1,100 దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో నియామకాలు సహా నామినేటెడ్ పదవులన్నీ జూన్‌లోగా భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని, ఆ పదవులు ఆశిస్తున్న వారు పార్టీ విభాగాలైన క్లస్టర్, యూనిట్, బూత్ సభ్యులై ఉండాలని స్పష్టం చేశారు. మొదటి నుంచి టీడీపీలో ఉండి పని చేసిన వారినే నేతలు ప్రోత్సహించాలన్నారు.