అనంతపురం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

79చూసినవారు
అనంతపురం వైసీపీ కార్యాలయానికి నోటీసులు
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. అనంతపురం వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయాన్ని శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుమతులు లేకుండా నిర్మించారంటూ అనంతపురం హెచ్‌ఎల్సీ కాలనీలో వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటాని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్