మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19న దాడి జరిగే ముందు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.