ఏపీలో నిరుద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల నిరుద్యోగులు ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. వివరాలకు http:apmsrb.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.