ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం రేపల్లెలో ఈ ఘటన జరిగింది. దీనిపై టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రేపల్లెలో రాజకీయ కాక రాజుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.