గంపలగూడెం మండలంలో మేడూరు అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ సిహెచ్. రేవతి కుమారి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రేకు పాలు పట్టిస్తే అవి అమృతంతో సమానమని, బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు కళ్యాణి, నాగలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.