పాణ్యం: ఉల్లి రైతుల సమస్యలు పరిష్కరించాలి
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం చేతకాక, సరుకు ఎక్కువగా వస్తోందని సాకులు చెబుతున్నారని బుధవారం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిశీలించారు. టీడీపీ నేతలు కమీషన్లపై చూపుతున్న శ్రద్ధలో 40 శాతం రైతు సమస్యలపై దృష్టి పెడితే రైతులకు ఇన్ని ఇబ్బందులు ఉండవన్నారు.