పాణ్యం: సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలి
కల్లూరు మండలం పెద్దపాడులో వంకను పూడ్చి ఫ్లాట్లు వేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, మాట్లాడారు. వడ్లోని వంకను ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు.