ఏపీ హోంశాఖ మంత్రి అనితపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త బద్దం అశోక్‌రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడు నిజామాబాద్‌లో ఉన్నాడని తెలుసుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సీసీఎస్‌కి తరలించారు. ఆదివారం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం గుంటూరు జైలుకి తరలించారు.