ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. గురువారం నిర్వహించిన ఏపీ అసెంబ్లీ సభలో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో పెట్టుబడులు వచ్చాయని భ్రమించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. రూ.12 లక్షల పెట్టుబడుల వివరాలు, ఉద్యోగాలు, జీఎస్టీ గురించి సభలో చెప్పాలని అన్నారు. కేవలం ఒప్పందాలు సరిపోవని, ఉద్యోగాల సంఖ్య చెప్పాలని ఆయన పేర్కొన్నారు.