IPL 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇంతలోనే రాజస్థాన్ రాయల్స్ టీమ్ కీలక ప్రకటన చేసింది. IPL తొలి మూడు మ్యాచ్‌లకు RR జట్టుకు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తాడని ప్రకటించింది. మార్చి 23న SRHతో జరిగే తొలి మ్యాచ్‌లో పరాగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 26న KKRతో, 30న CSKతో జరిగే మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించనున్నారు. RR కెప్టెన్ సంజూ శాంసన్ గాయం నుండి పూర్తిగా కోలుకొని కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపింది.