AP: ఎస్సీ వర్గీకరణ అంశంపై సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. మరికాసేపట్లో తన ఛాంబర్లో వారితో సమావేశం నిర్వహించనున్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికపై అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపనున్న నేపథ్యంలో దీనిపై సీఎం వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై ఆయన సభలో ప్రసంగించనున్నారు.