ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నోయిడాలో సెక్టార్ 63 సమీపంలోని బహ్లోల్‌పూర్ అండర్‌పాస్ వద్ద స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై ఉన్న వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు డ్రైవర్‌ను పట్టుకునేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు.