జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుల్గాం జిల్లా ఖాజీగుండ్‌లోని నిపోరా వద్ద జమ్మూ నుండి శ్రీనగర్‌కు వెళుతున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.