రాయలసీమ జిల్లాలకి ఆరెంజ్‌ అలర్ట్!

60చూసినవారు
రాయలసీమ జిల్లాలకి ఆరెంజ్‌ అలర్ట్!
ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలకి (కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు) ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసిన‌ట్లు వాతావర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని అధికారులు కోరారు. ఈనెల 16, 17 తేదీల్లో అత్య‌వ‌సరం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్