అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టేసింది. తన సన్నిహితురాలు, నటి పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడని రేణుకాస్వామిని దర్శన్‌తో సహా అతడి అనుచరులు కొట్టి చంపారు. ఈ కేసులో జూన్ 11న దర్శన్, ఆయన సన్నిహితురాలు పవిత్ర గౌడ, ఇతర నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు.