చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందిస్తాం: ప్రత్తిపాటి

62చూసినవారు
చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందిస్తాం: ప్రత్తిపాటి
బుడమేరు ముంపుతో వరదల్లో చిక్కుకున్న విజయవాడ నగరంలో చిట్టచివరి బాధితుడికి కూడా ప్రభుత్వ సాయం అందిస్తామని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలను మంగళవారం ఎమ్మెల్యే పర్యవేక్షించారు. స్థానిక 45వ డివిజన్ ఇన్ చార్జ్ ప్రత్తిపాటిని సీఎం చంద్రబాబు నియమించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్