దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు పది. అయితే ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ మావోయిస్టుల ప్రభావం తగ్గుతోంది. అన్ని చోట్లా కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహించడంతో మావోయిస్టులు అక్కడ నుంచి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తలదాచుకుంటున్నారు. అక్కడ కూడా నిరంతరం తనిఖీలు జరగడంతో వారు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునేందుకు చూస్తున్నారు.