గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి శానిటరీ డివిజన్ ఇన్స్పెక్టర్, ట్రాక్టర్, డ్రైవర్లకు మ్యాపింగ్ చేసి చెత్త తరలింపు వాహనాలు కేటాయించాలని అధికారులను కమిషనర్ పి. శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం వెహికిల్ షెడ్ ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, డ్రైవర్లు, పర్యవేక్షణ అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాల నిర్వహణ, పారిశుద్ధ్య విభాగానికి వాహనాలు కేటాయించడంపై పలు సూచనలు చేశారు.