యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపును చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. రక్త దానం అనేది ప్రాణ దానంతో సమానమని తెలిపారు. రక్త దానం చేసిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.