బొబ్బిలి మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ఉపాధి హామీ గ్రామ సభను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొద్దల పద్మ మాట్లాడుతూ ఉపాధి హామీ వేతన దారులకు వంద రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు రౌతు తిరుపతిరావు పాల్గొన్నారు.