బొబ్బిలి మండలంలోని బాలికల వసతి గృహంలో హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ వారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూ కె. ఉమా హెచ్. ఐ. వి,ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది? ఎలా వ్యాపించదు, హెచ్. ఐ. వి,ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్. ఐ. వి,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి వంటి అంశాలను ప్రస్తావించారు.