మెంటాడ మండలం అమరాయవలస గ్రామంలో లిటిల్ ఫ్లాక్ చర్చిలో బుధవారం పాస్టర్ శ్యాముల్ మాట్లాడుతూ ప్రేమ, కరుణ, దయలకు ప్రతిరూపం ఏసు అని పేర్కొన్నారు. ఏసుప్రభువు చూపించిన మార్గం మానవాళికి అనుసరణీయమని తెలిపారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగను ప్రతీఒక్కరు ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.