విజయనగరం జిల్లా గజపతినగరం చంపావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేశామని గజపతినగరం ఎస్. ఐ కె. లక్ష్మణరావు గురువారం సాయంత్రం తెలిపారు. శ్రీరంగ రాజపురం గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లు, సీతారాంపురానికి చెందిన ఒక ట్రాక్టర్ పట్టుకున్నామని చెప్పారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.