కొమరాడ మండలం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎస్ఈబీ, పోలీసుల ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర దాడులను గురువారం నిర్వహించారు. ఈ దాడుల్లో 9000 లీటర్ల బెల్లపు ఊట, 300 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ ఏఈఎస్ జీవన్ కిషోర్ తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో సారా నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సారా రవాణా తయారీ అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.