భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యులు నిరసన

80చూసినవారు
కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శనివారం నిరసన ర్యాలీ చేపట్టారు. మృతి చెందిన వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని నినాదాలు చేశారు. డాక్టర్లు ధరణి, దుర్గప్రసాద్, రాజన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్