నూతనంగా నిర్మించుకున్న ఇంటికి వాటరింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇంటిపై నుండి అకస్మాత్తుగా జారి పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన నెల్లిమర్ల మండలంలో చోటుచేసుకుంది. కొండగుంపాంకు చెందిన సేనాపతి రమణమ్మ నిర్మాణంలో ఉన్న తన ఇంటి గోడలు నీటితో తడుపుతూ జారిపడి కింద పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు.