నెల్లిమర్ల: తాగునీటి పరీక్షలను పరిశీలించిన ప్రత్యేక అధికారి

82చూసినవారు
నెల్లిమర్ల: తాగునీటి పరీక్షలను పరిశీలించిన ప్రత్యేక అధికారి
నెల్లిమర్ల మండలం జోగిరాజుపేటలో నిర్వహిస్తున్న త్రాగునీటి క్లోరినేషన్ పరీక్షలను మండల ప్రత్యేక అధికారి పి కూర్మినాయుడు బుధవారం పరిశీలించారు. క్లోరినేషన్ అనంతరం ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించేటట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్