పూసపాటిరేగ మండల కేంద్రంలో టిడిపి మాజీ మంత్రి పి నారాయణ స్వామి నాయుడు మంగళవారం రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజుతో కలిసి ప్రారంభించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ కార్యాలయం టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టిడిపి కార్యాలయం వేదిక అవుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.