వీరఘట్టం: రేషన్ సరుకులు బహిష్కరణ చేసిన మహిళలు

59చూసినవారు
వీరఘట్టం మేజర్ పంచాయితీలోని 6వ వార్డు గెంబలి వీధి వాసులు శుక్రవారం రేషన్ సరుకులను బహిష్కరించారు. ప్రతినెల ప్రభుత్వం బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే మాకు మాత్రం ఎటువంటి కందిపప్పు గాని పంచదార గాని ఇవ్వడం లేదని మహిళలు, వీధివాసులు ఆరోపించారు. రేషన్ ఇచ్చే బండి వద్ద నినాదాలు చేస్తూ తక్షణమే అన్ని సరుకులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you