ఇన్నోవేషన్ హబ్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పార్వతీపురం ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. ఇన్నోవేషన్ హబ్ నిర్మాణానికి సర్వే నం 249/1 లోని ఎ. 1. 34సెంట్లు స్థలాన్ని గుర్తించినట్లు ఆర్డీఓ కె. హేమలత కలెక్టర్ కు తెలిపారు. స్థలం అనువైనదిగా ఉన్నందున విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోర్సు ప్రయోగశాల ఏర్పాటు చేసి చర్యలుచేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.