పార్వతీపురం: రాజకీయ కక్షతో పింఛన్లు నిలిపివేయడం సరికాదు

52చూసినవారు
పార్వతీపురం జిల్లాలో రాజకీయ కక్షతో పింఛన్లు నిలిపివేయడం అన్యాయమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యమ్మల మన్మధరావు, గొర్లి వెంకటరమణ అన్నారు. బలిజిపేట మండలంలోని నారం నాయుడు వలస గ్రామానికి చెందిన కంది గౌరీ శంకర్రావు, చల్లా పాపమ్మ వంటి ఏడుగురి పింఛన్లు నిలిపివేయడంపై సోమవారం వారు ఆందోళన వ్యక్తం చేస్తూ.. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సమస్య పరిష్కరించకపోతే నిరసన చేపట్టనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్