బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురిసిన వర్షాలతో సంతకవిటి మండలంలో వందల ఎకరాల వరిపంట నీట మునిగి తీవ్ర పంట నష్టం జరిగింది. ఆదివారం రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రామారాయ పురం, మంతిన మల్లయ్యపేట గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. నీట మునిగిన పంట నష్టం ను అధికారుల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.