మెంటాడ: పోరంలో జిల్లా స్థాయి అథ్లెటిక్ క్రీడాకారుల ఎంపిక

72చూసినవారు
మెంటాడ: పోరంలో జిల్లా స్థాయి అథ్లెటిక్ క్రీడాకారుల ఎంపిక
మెంటాడ మండలం పోరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి అండర్-17 అథ్లెటిక్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు పీడీ కొల్లి తవిటినాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పెదమేడపల్లి- పోరం మధ్యలో మైదానాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు.