ఇప్పలవలస స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ గా పైడిపినాయుడు ఎన్నిక

76చూసినవారు
ఇప్పలవలస స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ గా పైడిపినాయుడు ఎన్నిక
మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో గురువారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మెన్ గా బర్నాల పైడిపినాయుడు, వైస్ చైర్మన్ గా దుప్పాడ మంగమ్మ ఎన్నికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ బర్నాల పైడుపినాయుడు మాట్లాడుతూ స్కూలు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. స్కూలు అభివృద్ధి ధ్యేయంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ స్కూలును అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్