గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు

65చూసినవారు
గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు
కొత్తవలస సీఐ చంద్రశేఖర్ ఆదేశాలతో ఎస్ ఐ సుదర్శన్ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపడుతుండగా విశాఖ వైపు బైక్ పై ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన మరో ఇద్దరిని చింతలపాలెం వద్ద అరెస్టు చేసారు. వారి వద్ద నుండి 3. 4 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్