జామి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన మంత్రి

51చూసినవారు
జామి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన మంత్రి
జామి మండలం అట్టాడకు చెందిన పొలిపిరెడ్డి గణేష్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 3. 70 లక్షల చెక్కును మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు బుధవారం అందజేశారు. కాగా గణేష్ కు పుట్టిన కవల పిల్లల ఆరోగ్యం బాగా లేని నేపథ్యంలో ఆయన తన పిల్లలను విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందజేస్తున్నారు. ఈ మేరకు మంత్రి చొరవతో సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం మంజూరు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్