శృంగవరపుకోట: ఎస్. కోట నుండి పెందుర్తికి నాలుగు లైన్ల రహదారి

79చూసినవారు
శృంగవరపుకోట: ఎస్. కోట నుండి పెందుర్తికి నాలుగు లైన్ల రహదారి
భారతమాల పరియోజన చొరవ కింద పెందుర్తి నుండి ఎస్ కోట మండలం బొడ్డవర వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ. 956. 21 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. బుధవారం ఆమె ఎల్ కోటలో మాట్లాడుతూ ఈ రహదారి పూర్తయితే ఎస్. కోట - విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందన్నారు. అరకు పర్యాటక రంగానికి ఈ రహదారి దోహదపడుతుందన్నారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్