AP: పిఠాపురం లో జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కొణతాల రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటి చేత్తో పోరాటం చేశారని చెప్పారు. ఓ సందర్భంలో మోదీ తన వెంట పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా చెప్పారని సభ ముఖంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో, దేశంలో మన పార్టీ సత్తా చాటిందని, రాష్ట్రం, ఇక్కడి ప్రజలు బాగుండాలని పవన్ భావించారని, ఏ సమస్య చెప్పినా.. తానున్నానని ధైర్యం చెప్పేవారని పేర్కొన్నారు.