AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. అంతేగాక అల్లు అర్జున్ జరిగిన ఘటనపై త్వరగా స్పందించి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని పవన్ అన్నారు. 'సంఘటన జరిగిన 27 రోజుల తర్వాత నోరు మెదిపి, మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం' అని పవన్‌కు అంబటి కౌంటర్ ఇచ్చారు.