ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉంటాయని వివరించారు. 10వ తేదీ నుంచి 19 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని ప్రకటించారు. అయితే, మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు.