ప్రజల ఆశలు, ఆకాంక్షలు అసెంబ్లీలో ప్రతిఫలింపచేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 'సభా వ్యవహారాలపై పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షించారు. సభ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. శాఖాపరమైన అంశాలు, ప్రజా సమస్యలను అధ్యయనం చేసి చర్చల్లో పాల్గొనాలి. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఉక్కుపాదం మోపుదాం. ప్రజలు, అధికారులతో వాడే భాష మర్యాదపూర్వకంగా, సరళంగా, గౌరవంగా ఉండాలి. పరుష పదజాలం వద్దు' అని ఎమ్మెల్యేలకు సూచించారు.