ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరులోని పాలెంలో ఉదయం నిర్వహించే అటవీ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అరణ్య భవన్‌లో జరిగే సంస్మరణ సభలో ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు నివాళులు అర్పించనున్నారు.