ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా ఎక్కడా కనిపించటంలేదు. ఆయన రిపబ్లిక్ డే రోజున కనిపించారు. పవన్ ఒక వైపు పాలనా వ్యవహారాలను చూసుకుంటూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తున్నారని చర్చ కొనసాగుతోంది. తాజాగా పవన్ తన భార్యతో పాటు పిల్లలను కలుసుకునేందుకు స్విట్జర్లాండ్ వెళ్ళారని ప్రచారం సాగుతోంది. అక్కడి నుంచే నేరుగా పవన్ ఢిల్లీ వచ్చి బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.