వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో క్యాంపు కార్యాలయం తెరుస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటించారు. రాయలసీమలో జనసేన బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయ వ్యూహాన్ని పసిగట్టిన వైసీపీ నేలు.. ఆయనకు విరుగుడుగా రాయలసీమ సెంటిమెంట్ రాజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ను ఆదిలోనే అడ్డుకోకుంటే తమ పార్టీ కిందకు నీళ్లు రావడం ఖాయమనే ఉద్దేశంతో వైసీపీ అగ్రనాయకత్వం కౌంటర్ అటాక్ మొదలు పెట్టినట్లు చెబుతున్నారు.