AP: పిఠాపురంలో జరిగిన జయకేతనం సభలో ‘హిందీ మన భాషే కదా?’ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ విమర్శలు గుప్పించింది. అప్పట్లో ‘హిందీ గో బ్యాక్’ అనే పేపర్ ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేయడాన్ని గుర్తు చేసుకుంది. ఆ ఆర్టికల్‌పై స్పందించిన ఆయన.. ‘నార్త్ ఇండియా రాజకీయ నేతలు మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకుని గౌరవించాలి.’ అని రాసుకొచ్చారు. మరి ఇప్పుడేమో పవన్‌కు హిందీపై ప్రేమ పుట్టుకొచ్చిందని వైసీపీ ఫైర్ అయింది.