ఏపీలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొత్తం 4,21,698 మందికి రూ.625 కోట్లు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. కేవలం 70 మందికి మాత్రమే ఇంకా పరిహారం అందలేదని తెలిపారు. భవిష్యత్తులో విజయవాడకు వరద ప్రమాదం లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.