ప్రైవేటు కళాశాలల్లో పీజీ వైద్య విద్య కోర్సులకు 2020-21 నుంచి 2022-23 వరకు ఫీజులను ఖరారు చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 56ను హైకోర్టు రద్దు చేసింది. కళాశాలల ప్రతిపాదనలను పరిశీలించి రెండు నెలల్లో కాలేజీల వారీగా ఫీజులను నిర్ణయించాలని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఆదేశించింది. కళాశాలలు కోరినట్టు ఫీజులను నిర్ణయించేందుకు అంగీకరించకపోతే తుది ఉత్తర్వులిచ్చే ముందు ఆయా యాజమాన్యాల అభిప్రాయాలను సేకరించాలని స్పష్టం చేసింది.